: అన్ని పార్టీలు అంగీకరించి, మాటమార్చాయి: సుబ్బరామిరెడ్డి


రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై జరుగుతున్న చర్చలో ఎంపీ సుబ్బరామిరెడ్డి తన అభిప్రాయాలను తెలిపారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా అంగీకరించి, ఇప్పుడు మాటమార్చుతున్నాయని ఆరోపించారు. తొలుత అన్ని పార్టీలు అంగీకరించి, ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నాయని విమర్శించారు. ప్రస్తుత అనిశ్చితి కారణంగా రెండు ప్రాంతాల మధ్య అభద్రత భావం నెలకొందని అన్నారు. ఇకనైనా, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవాలని సుబ్బరామిరెడ్డి సూచించారు.

  • Loading...

More Telugu News