: తెలంగాణపై నిర్ణయం నిబద్దతతోనే తీసుకున్నారా?: అన్నాడీఎంకే సూటి ప్రశ్న


కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయవాదమనే నిప్పుతో చెలగాటమాడుతోందని అన్నా డీఎంకే పార్టీ ఎంపీ మైత్రేయన్ తెలిపారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై మాట్లాడుతూ, తెలంగాణపై నిబద్ధతతోనే నిర్ణయం తీసుకున్నారా? అని మైత్రేయన్ ప్రశ్నించారు. తెలంగాణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటని అడిగారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివారో లేదోననే అనుమానం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకునే ముందు కనీసం సొంతపార్టీ నాయకులనైనా సంప్రదించారా..? అని అనుమానం వ్యక్తం చేశారు. 'రాష్ట్ర విభజన చిన్న విషయమా? ఎలా పడితే అలా ప్రకటనలు చేయడానికి' అని మైత్రేయన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News