: విభజన అంత తేలికైన విషయం కాదు: కనిమొళి
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై చర్చలో డీఎంకే సభ్యురాలు కనిమొళి పాలుపంచుకున్నారు. రాష్ట్ర విభజన అంత తేలికైన విషయం కాదన్నారు. రాష్ట్ర విభజన అంటే భావోద్వేగాలతో ముడిపడిన అంశమని ఆమె అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాలతో ఏపీలో ప్రజలు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. వారి భయాలు, ఆందోళనలకు జవాబివ్వకుండా ముందుకు వెళ్ళలేరని ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు.