: తెలంగాణపై నిర్ణయాన్ని కేంద్రం పునరాలోచించుకోవాలి: తృణమూల్
తెలంగాణపై కేంద్రం ప్రకటన పట్ల తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతోనే అసోంలో బోడోలాండ్, పశ్చిమ బెంగాల్ లో గూర్ఖాలాండ్, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉద్యమాలు మళ్లీ తెరపైకి వచ్చాయని తృణమూల్ ఎంపీ శేఖర్ రాయ్ గుర్తు చేశారు. కాబట్టి, తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం పునరాలోచించుకోవాలని శేఖర్ రాయ్ కోరారు. తెలంగాణ నిర్ణయం కారణంగా దేశంలో అనేక ఆందోళనలు వచ్చాయన్న ఆయన, ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్వతంత్ర డిమాండ్లు కూడా వచ్చాయని పేర్కొన్నారు.