: కాంగ్రెస్ పని రగిలించడమే: సీతారాం ఏచూరి
కాంగ్రెస్ పార్టీపై సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శల వర్షం కురిపించారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. 44 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందో ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే రాజ్యాంగంలో 371(డి) పొందుపరిచారన్నారు. నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ నిబంధనను ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో ఇందిరాగాంధీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే ఇలాంటి సమస్యలకు పరిష్కారమని చెప్పారని సీతారాం గుర్తు చేశారు. ఇక మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సూచించిందని, దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ ప్రాతిపదికనే ఐక్య కేరళ, ఐక్య మహారాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వివరించారు.