: జగన్ రిమాండు పొడిగింపు
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ రిమాండు విధించింది. మరోవైపు ఓబుళాపురం, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల్లో నిందితులకు కూడా అదే తేదీ వరకు రిమాండు పొడిగించింది. ప్రధానంగా ఓఎంసీ కేసులో నిందితులు గాలి జనార్ధన రెడ్డి, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సునీల్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టు విచారించింది.