: 'కంగారు' పడతారో.. కార్యం సాధిస్తారో!
ఐదు టెస్టుల యాషెస్ లో ఆస్ట్రేలియా జట్టు ముందు విజయావకాశం నిలిచింది. ఇంగ్లండ్ లోని చెస్టర్ లీ స్ట్రీట్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ ముందు ఇంగ్లండ్ 299 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆటకు ఇంకా ఒకటిన్నర రోజు సమయం మిగిలున్న నేపథ్యంలో క్లార్క్ సేన కాస్త కష్టపడితే గెలుపు కష్టమేమీ కాబోదు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 238 పరుగులు చేయగా, ఆసీస్ 270 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను ఆసీస్ పేసర్ ర్యాన్ హ్యారిస్ 7 వికెట్లతో హడలెత్తించాడు. దీంతో, ఆ జట్టు 330 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్ లో తొలి రెండు టెస్టులను ఇంగ్లండ్ గెలుచుకోగా, మూడో టెస్టు డ్రాగా ముగిసింది.