: 'తెలంగాణ'కు సీమాంధ్ర ప్రజలు సానుకూలమేనట: ప్రొఫెసర్ గారి ఉవాచ


తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త పల్లవి వినిపిస్తున్నారు. ఓవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతుంటే.. ఈ ప్రొఫెసర్ ఏమంటున్నారో వినండి. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు సానుకూలమేనంటున్నారు. సీమాంధ్రలో ప్రజలను నాయకులే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హైదరాబాదు విషయంలో తాము రాజీపడబోమన్నారు. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని చెబుతూ, నగరంలో సీమాంధ్రుల రక్షణకు ఎటువంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News