: సమ్మె విరమించుకోండి: ఆనం
నిరవధిక సమ్మెను విరమించుకోవాలని ఏపీఎన్జీవోలను కోరినట్టు ఆర్ధికశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గ ఉపసంఘం ఉన్నట్లే ఇప్పుడు ఆంటోనీ కమిటీ ఉందని, దానికి సమస్యలు నివేదించుకుంటే సరిపోతుందని అన్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాలు పంచుకుంటామని ఉద్యోగ సంఘాలు హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికీ భద్రత కల్పించడం ప్రభుత్వం భాధ్యత అని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని అంశాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.