: కిష్త్వాడ్ ఘటనపై రాజ్యసభలో చిదంబరం ప్రకటన
మత ఘర్షణల కారణంగా జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వాడ్ లో ఏర్పడిన పరిస్థితులపై ఆర్ధిక మంత్రి పి.చిదంబరం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణను ఉగ్రవాదంతో ముడిపెట్టడం సరికాదన్నారు. కిష్త్వాడ్ ఘటనపై ఇప్పటికే జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిందని సభకు తెలిపారు. ఈ ఘటనకు, ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణే ఘటనకు కారణమైందని పేర్కొన్నారు. కాశ్మీర్ లో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని, ఆ ప్రాంతం నుంచి వలసలను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, కిష్త్వాడ్ లో సాధారణ పరిస్థితి ఉందని చిదంబరం తెలియజేశారు.