: భూకంపంతో టిబెట్ లో దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు
చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఈ ఉదయం వచ్చిన భూకంపంతో రోడ్లు, ఇళ్లకు నష్టం వాటిల్లింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. గాయపడినవారి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఆగ్నేయ చైనాలో లాసా పట్టణానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీనికి సమీపంలోనే రింగో అనే పట్టణం ఎత్తయిన పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడి జనాభా 3,476. వీరికేమైనా ఆపద వాటిల్లిందా? అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.