: స్మార్ట్ ఫోనుతో పనిచేయనున్నస్ట్రాట్ నానో శాటిలైట్
పీఎస్ఎల్వీ- సీ20 కక్ష్యలో ప్రవేశ పెట్టనున్న స్ట్రాండ్-1 నానో శాటిలైట్..ప్రత్యేక సౌకర్యాన్ని మొబైల్ వినియోగదారులకు అందించనుంది. ఇప్పటివరకు భూమిపై తమకు కావలసిన ప్రాంతాల చిత్రాలను నెట్ నుంచి పొందుతున్న వారికి..అరచేతిలోనే వాటిని అందిస్తామంటోంది సర్రే స్పేస్ సెంటర్.
తాము తయారు చేసిన స్ట్రాట్ నానో శాటిలైట్ ఇకపై వినియోగదారులకు కావాల్సిన ప్రాంతాలను మంచి రిజల్యూషన్ తో మొబైల్ లోనే పొందొచ్చని ఈ సంస్థ అంటోంది. అయితే ఇందుకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన గూగుల్ నిక్సన్ వన్ మొబైల్ ఫోనునే ఉపయోగించాలి. దీంతో ఈ సౌకర్యం కావాలనుకునేవారు దాదాపు రూ. 29 వేలు పెట్టి ఫోను కొనుక్కోవాల్సి ఉంటుంది.