: సమ్మెతో సాధించేదేమీ లేదు: దిగ్విజయ్
ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, సమ్మెతో సాధించేదేమీ లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. చర్చల ద్వారానే ఏదైనా సాధ్యమని, చర్చలకు తమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయని దిగ్విజయ్ స్పష్టం చేశారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ఏపీఎన్జీవోలతో చర్చిస్తుందని తెలిపారు.