: కాంగ్రెస్ ఎంపీలు నాటకాలాడుతున్నారు: టీడీపీ ఎంపీలు
రాష్ట్రంలోని పరిస్థితులు తెలిపేందుకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధంగా లేరని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీలంతా నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నినాదాలు చేసేందుకు కూడా వారికి మనసొప్పడం లేదని మండిపడ్డారు. ఏ టైంలో నిరసన తెలపాలో, ఎప్పుడు ప్లకార్డులు ప్రదర్శించాలో వారికి తెలియడంలేదని.. అధిష్ఠానం సూచించిన టైంలోనే వారి నిరసనలు ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో మీ కోసం పోరాడతామని ప్రజలకు చెప్పి, ఇక్కడికొచ్చి అధిష్ఠానం చెప్పినట్టు గంగిరెద్దుల్లా తలూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం సీమాంధ్రకు చేస్తున్న అన్యాయాన్ని నిలదీయాల్సింది పోయి కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.