: కృష్ణుడి వేషధారణలో లోక్ సభకు వెళ్లిన టీడీపీ ఎంపీ
టీడీపీ ఎంపీ శివప్రసాద్ శ్రీకృష్ణుడి వేషధారణలో లోక్ సభకు హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. భారతంలో పాండవులకు, కౌరవులకు సంధి చేసేందుకు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన సందర్భంగా ఆయన వినిపించిన ఓ పద్యాన్ని నేటి రాష్ట్ర పరిస్థితులకు అన్వయిస్తూ పాడి సహచరులను ఆకట్టుకున్నారు. తనను రాష్ట్ర ప్రజలు ఎంపీగా లోక్ సభకు పంపించారంటూ, వారి ప్రతినిధిగా వారి ప్రతిస్పందనను తెలపాల్సిన అవసరం తనపై ఉందని ఆయన నొక్కి చెప్పారు. అందుకే సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా నిరసన తెలిపానన్నారు. సోనియా చెవిలో విషయాన్ని చెప్పానని, ఆమె విచక్షణతో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.