: సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురంలో అప్రకటిత బంద్ జరుగుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ విధులను బహిష్కరించాయి. జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు విధులు బహిష్కరించడంతో స్కూళ్లన్నీ మూతబడ్డాయి. మరోవైపు వాణిజ్య సంస్థలూ బందయ్యాయి. సుమారు వెయ్యి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో, జిల్లావ్యాప్తంగా అప్రకటిత బంద్ కొనసాగుతోంది.