: సమైక్యాంధ్రకు మద్దతుగా వినోద ఛానెళ్ల నిలిపివేత
సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుకుంటోంది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతుండడంతో వారికి సంఘీభావంగా కేబుల్ ఆపరేటర్లు కూడా ఆందోళనకు దిగారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేబుల్ ఆపరేటర్లు వినోద ఛానెళ్లను నిలిపేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు, ఈ రెండు జిల్లాల్లో కేవలం వార్తా ఛానెళ్లు మాత్రమే ప్రసారమవుతాయి.