: శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు ఆగ్రహం
ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణకు గైర్హాజరైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు మండిపడింది. తదుపరి విచారణకైనా హాజరుకాకపోతే మెడికల్ రిపోర్టు తప్పనిసరిగా సదరు న్యాయవాది ద్వారా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఐఏఎస్ లు బీపీ ఆచార్య, వెంకట్రామిరెడ్డి, శామ్యూల్, మన్మోహన్ సింగ్, దాల్మియా సిమెంట్స్ సీఎండీ.. కోర్టుకు వచ్చారు.