: సైకిల్ పై ప్రపంచాన్ని చుట్టేస్తున్న భారతీయుడు
సంకల్పం గట్టిదయితే చాలు.. దానికేదీ అడ్డురాదని నిరూపిస్తున్నాడు ఒక భారతీయుడు. పశ్చిమబెంగాల్ కు చెందిన సోమెన్ దేబ్ నాథ్ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో 2004లో 'సైకిల్ పై ప్రపంచయాత్ర'ను ప్రారంభించాడు. 79 దేశాలను సైకిల్ పై చుట్టేసి ప్రస్తుతం ఖతార్ చేరుకున్నాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియాకు 15న ప్రయాణమవుతాడు.
2020 నాటికి 191 దేశాలను పర్యటించి రావాలన్నది అతడి లక్ష్యం. మొత్తం మీద 2 లక్షల కిలోమీటర్ల దూరం పర్యటించి 20 లక్షల మంది ప్రజలను కలుసుకోవాలన్నది అతడి సంకల్పం. ఇతడికి మరో లక్ష్యం కూడా ఉంది. కోల్ కతా సమీపంలో ఒక ప్రపంచస్థాయి గ్రామాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం బెంగాల్ ప్రభుత్వం ఎనిమిది హెక్టార్ల భూమిని కేటాయించాలని కోరుతున్నాడు. అన్నట్లు, ఇతడి ప్రపంచవ్యాప్త పర్యటనకు అవసరమైన ఖర్చులను దారి పొడవునా ఎదురయ్యే ప్రజలే భరిస్తున్నారట.