: బీజేపీలో విలీనమైన జనతా పార్టీ
ఒంటరిగా ఎన్నో ప్రజాసమస్యలపై పోరాడి, ఎందరో అవినీతిపరులకు ముచ్చెమటలు పోయించిన జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. నిన్న, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సమక్షంలో జనతాపార్టీని విలీనం చేస్తున్నట్లు స్వామి ప్రకటన చేశారు. దేశానికి మంచి భవిష్యత్తు అందించేందుకు బీజేపీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. గతంలో జన్ సంఘ్ లో పనిచేసిన సుబ్రమణ్యస్వామి అనంతరం జనతా పార్టీ స్థాపనలో పాలు పంచుకున్నారు. 1990 నుంచి ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఐదు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. ప్రణాళికా సంఘం సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుబ్రమణ్యస్వామి హిందుత్వకు గట్టి మద్దతుదారు. చెన్నయ్ లోని మైలాపూర్ ఆయన జన్మస్థలం.