: నేటి అర్ధరాత్రి నుంచి స్తంభించనున్న సీమాంధ్ర


సీమాంధ్ర నేటి అర్ధరాత్రి నుంచి స్తంభించిపోనుంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (ఎపీఎన్జీవో) నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ రోజు సమ్మె నోటీసు ఇవ్వనుంది. మరోవైపు, సీమాంధ్ర ప్రాంతంలోని మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీనికి తోడు ఆర్టీసీ కార్మికులు కూడా ఎపీఎన్జీవోలకు మద్దతుగా నిరవధిక సమ్మెను ప్రారంభించనున్నారు. పెట్రోల్ బంకులు 24 గంటల పాటు మూతపడనున్నాయి. వెరసి సీమాంధ్రలో ప్రభుత్వ పాలన, రవాణా స్తంభించిపోనుంది.

  • Loading...

More Telugu News