: ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల భేటీ
ఢిల్లీలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈ ఉదయం సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర విభజనపై ఆందోళనల నేపథ్యంలో, సమస్యలు వినడానికి కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ సారథ్యంలో నియమించిన కమిటీ రేపటి నుంచి తన పనిని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కమిటీకి తమ ఆందోళనను తెలియజేసేందుకు సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు.