: నెల్లూరు వెళ్లనున్న ఎన్ఐఏ బృందం
జంట పేలుళ్ల కేసు దర్యాప్తు జెట్ స్పీడుతో సాగుతోంది! హైదరాబాద్ సంఘటనలో నిందితుడుగా భావిస్తున్న మక్బూల్ కు నెల్లూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో లింకులపై ఆరా తీయనున్నారు. ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైన ఎన్ఐఏ బృందం నెల్లూరు వెళ్లనున్నట్టు సమాచారం.
మక్బూల్ కిందటి ఏడాది నెల్లూరు జైలులో ఫిరోజ్ (నిజామాబాద్), అబిద్ హుస్సేన్ (జహీరాబాద్) అనే ఇద్దరు ఖైదీలతో ములాఖాత్ అయినట్టు తెలియడంతో ఆ దిశగా దృష్టి సారించారు. ఈ ఖైదీలిద్దరినీ మక్బూల్ అనే వ్యక్తి కలిసినట్టుగా గత ఏడాది జైలు రికార్డుల్లో నమోదు అయింది.