: మీ మృత్యుఘడియలు తెలుసుకోండి


మనం ఎంతకాలం జీవించి ఉంటాం...? ఎప్పుడు మరణిస్తాం? అనే విషయాల గురించి చాలామందికి సందేహాలుంటాయి. అయితే ఎప్పుడు మరణిస్తామనే విషయంలో ఒక స్పష్టత అనేది ఉంటే ఇక టెన్షనే ఉండదు. ఇంతకాలం వరకూ జీవించి ఉంటాం అనే విషయం తెలిస్తే జీవించి ఉన్న కాలంలో మనం చేయాలనుకున్న పనులను పూర్తి చేసుకోవచ్చు. ఈ విషయంలో మన జీవిత కాలం ఎంత? అనే విషయాన్ని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అయితే తొలిసారిగా మనిషి ఎంతకాలం జీవించి ఉంటాడు అనే విషయాన్ని కచ్చితంగా అంచనావేసి చెప్పే ఒక పరీక్షను పరిశోధకులు రూపొందించారు. ఈ పరీక్షద్వారా మనం ఎంతకాలం జీవించి ఉంటామనే విషయాన్ని ఇట్టే తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

బ్రిటన్‌లోని లంకాస్టెర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అనేటా స్టెఫానోవ్‌స్కా, పీటర్‌ మెక్‌క్లింటాక్‌ అనే పరిశోధకులు ఒక కొత్తరకం పరికరాన్ని కనుగొన్నారు. చేతి గడియారం తరహాలో తయారైన ఈ పరికరం ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా మృత్యుపరీక్ష నిర్వహించి మనుషులు ఎంతకాలం జీవించి ఉంటారనే విషయాన్ని తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరికరం ద్వారా చాలా సరళమైన పద్ధతిలో ఎలాంటి కోత లేకుండా నొప్పి కలిగించని లేజర్‌ కిరణాలను చర్మం ఉపరితలంపైకి ప్రసరింపజేస్తారు. ఈ కిరణాల ద్వారా చర్మంలోని ఎండోథీలియల్‌ కణాల్ని విశ్లేషించడం ద్వారా సదరు వ్యక్తి శరీరం వయసు ఎంతకాలంలో క్షీణిస్తుందనే విషయాన్ని అంచనావేస్తుంది. శరీర కణాలలోపల డోలనచర్యలను గణించడం ద్వారా పరిశోధకులు మరణానికి ముందు మనిషి జీవించి ఉండే కాలాన్ని లెక్కిస్తారు. క్యాన్సర్‌, డిమెన్షియా వంటి రోగాలకు సంబంధించిన పరీక్షల్ని కూడా చేపడతారు. సాధారణ వైద్యులకు సైతం ఈ పరికరం అందుబాటులోకి వచ్చేందుకు మరో మూడేళ్ల సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News