: పొగరాయుళ్లకోసం ఓ యాప్‌


గుప్పు గుప్పుమంటూ పొగ వదిలే పొగరాయుళ్లు వద్దంటున్నా ఇలా రైలింజనులా పొగవదులుతూ ఉంటారు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కొందరు ఎంచక్కా కొంచెమే కదా... అంటూ సిగరెట్లు వంటివి కాల్చేస్తుంటారు. మరికొందరైతే తాము పొగతాగడం మానాలనుకున్నా మానలేకపోతున్నామని వాపోతుంటారు. ఇలాంటి వారికోసం ఒక కొత్త యాప్‌ వచ్చింది. ఈ యాప్‌తో చక్కగా మీరు పొగతాగడం మానేస్తారట.

టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి ఎండీ అయిన ఆండ్రసన్‌ క్యాన్సర్‌ కేంద్రంలో ప్రవర్తన శాస్త్రం (బిహేవియరల్‌ సైన్స్‌) ఆచార్యుడైన ప్రొఖ్రోవ్‌లు చక్కగా పొగతాగేవాళ్లకు సదరు అలవాటును మాన్పించేందుకు వీలుగా ఒక కొత్త యాప్‌ను సృష్టించారు. 'టుబాకో ఫ్రీ టీన్స్‌' అనేపేరుతో సృష్టించిన ఈ యాప్‌ పొగతాగడంపై వ్యక్తులకున్న ఆసక్తిని తగ్గించే విధంగా పనిచేస్తుందని వీరు చెబుతున్నారు. ఎంత ప్రయత్నించినా పొగతాగడం మానలేనివారు తాము సృష్టించిన ఈ యాప్‌ను వాడి చూడండి అంటున్నారు.

  • Loading...

More Telugu News