: అపర చాణుక్యుడు వల్లభాయ్ పటేల్: నరేంద్ర మోడీ
భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ.. పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి సేవచేసిన మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన భాగ్యమన్నారు. దేశ ప్రజలందరికీ ఆరాధ్యనీయుడు సర్థార్ వల్లభాయ్ పటేల్ అని మోడీ తెలిపారు. దేశంలోని స్వదేశీ సంస్థానాలను భారత్ లో కలిపి దేశాన్ని సమగ్రంగా ఉంచడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ విలీనం కోసం పటేల్ ఎంతో కృషి చేశారని తెలిపిన మోడీ, పటేల్ చాణుక్యుడంతటి రాజనీతజ్ఞుడని కొనియాడారు.