: మోడీ సభ ఫీజు.. ఉత్తరాఖండ్ వరద బాధితులకు
నవభారత యువ భేరి సభకు హాజరయ్యేందుకు యువత ఐదు రూపాయల ప్రవేశ రుసుం చెల్లించడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారని, మరి కొంతమంది 10 రూపాయలు చొప్పున చెల్లించారని వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. అలా సేకరించిన పది లక్షల రూపాయల చెక్కును బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కోశాధికారి ప్రభాకర్... నరేంద్ర మోడీకి అందజేశారు. దీనిపై మోడీ స్పందింస్తూ సమాజసేవకు రాజకీయ సమావేశాన్ని ఉపయోగించడం తనకు అమితమైన ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ప్రవేశరుసుం చెల్లించి మరీ సభకు వచ్చిన యువతరానికి మోడీ అభినందనలు తెలిపారు.