: రానున్నది మోడీ ప్రభంజనం : కిషన్ రెడ్డి


నవభారత నిర్మాణానికి గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార సారధి నరేంద్ర మోడీ నడుం బిగించారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నవభారత యువ భేరి సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం, దేశంలో మోడీ ప్రభంజనం వీస్తోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని అన్నారు. అన్ని రాజకీయ పక్షాల్లో మోడీ గురించే చర్చ సాగుతోందని ఆయన తెలిపారు. ఈ సభ ద్వారా సేకరించిన మొత్తాన్ని ఉత్తరాఖండ్ వరద బాధితులకు అందజేస్తామని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లో మోడీ కీలక శక్తిగా మారారని కిషన్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News