: భారత రాయబార కార్యాలయం నుంచి వెళ్లిపోయిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు


మాల్దీవుల్లోని మాలెలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో తలదాచుకున్న  మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అక్కడి  నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 13న భారత రాయబార కార్యాలయాన్ని ఆయన ఆశ్రయించారు. తనకు తానే కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయద్ అక్బరుద్దీన్ చెప్పారు.

మాల్దీవుల అధ్యక్షుడిగా నషీద్ వున్న సమయంలో చీఫ్ క్రిమినల్ జడ్జి అబ్దుల్లా మహ్మద్ ను నిర్భంధించారు. ఈ వ్యవహారంలో కోర్టు ఎదుట హాజరు కావాలని ఆయనకు స్థానిక కోర్టు గత సంవత్సరం జనవరిలో నోటీసులు పంపించింది. కానీ, న్యాయస్థానం ఎదుట హాజరవకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అదే సమయంలో ఆయన రాజకీయాలకు అర్హులు కారంటూ ఆయన్ను పార్టీ బహిష్కరించింది. కాగా, నషీద్ పై రెండు సార్లు అరెస్టు వారెంటు కూడా జారీ అయింది.

  • Loading...

More Telugu News