: ఏడేళ్ల చిన్నారిపై రైల్లో అత్యాచారం
కామాంధులు రెచ్చిపోతున్నారు. పెద్దా చిన్నా తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. రాయ్ పూర్ లోని కుర్లా-హౌరా ఎక్స్ ప్రెస్ లో ఏడేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. శుక్రవారం రాత్రి రైల్లో అందరూ నిద్రపోతున్న సమయంలో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చిన్నారి రైల్లో బాత్రూంకి వెళ్లడాన్ని గమనించిన నిందితుడు ఆమె వెంట వెళ్లి బాత్రూమ్ గదిలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి అరవకుండా ఉండేందుకు నిందితుడు బాలిక నోట్లో గుడ్డలు కుక్కాడు. బాధితురాలు సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నిందితుడి సమాచారం అందించిన వారికి 25 వేల రూపాయలు నజరానా అందజేస్తామని పోలీసులు ప్రకటించారు.