: పాక్, చైనాలు చొచ్చుకొస్తున్నా చేష్టలుడిగిన కేంద్రం: నాగం
భారత భూభాగంలోకి పాక్, చైనా సేనలు చొచ్చుకొస్తున్నా కేంద్రప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన నవభారత యువ భేరి సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెలంగాణను ప్రకటించేది బీజేపీయేనని ఎప్పుడో చెప్పానని ఆయన అన్నారు. బీజేపీ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రకటించిందని, ఇప్పుడు వెనకడుగేస్తే బీజేపీ ఇస్తుందని తెలిపారు. మోడీ నాయకత్వంలో గుజరాత్ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.