: 2.5 కోట్లకు టోపీ పెట్టిన మోసగాడ్ని అరెస్టు చేసిన పోలీసులు
అధికవడ్డీల ఆశ చూపి ప్రజలను బుట్టలో వేసుకుని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని కుషాయిగూడకు చెందిన ఓ వ్యక్తి అధిక వడ్డీ పేరిట 2.5 కోట్ల రూపాయలు దండుకుని ఉడాయించిన మోసగాడ్ని అరెస్టు చేశారు. నిందితుడు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకున్న బాధితులు ఆందోళన చేపట్టారు. బాధితులు ఆందోళన చెందవద్దని న్యాయం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు.