: కుమార్తెలను నిరాశ పరిచిన ఫరాన్ అఖ్తర్


భాగ్ మిల్కా భాగ్ సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరిన బాలీవుడ్ నటుడు ఫరాన్ అఖ్తర్ తన కుమార్తెలను నిరాశపరిచాడట. ప్రతి సినిమా విడుదలకు ముందు తన ఇద్దరు కుమార్తెలతో ఎక్కువ సమయం గడపడం ఫరాన్ కు అలవాటు, వారితో ఎక్కువ సమయం గడిపితే తనకు కలిసి వస్తుందని బలంగా నమ్ముతాడీ బాలీవుడ్ మిల్కా. అయితే భాగ్ మిల్కా భాగ్ సినిమా సందర్భంగా నెలల తరబడి వాళ్లతో గడపలేదు. దీంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారట. సినిమా రిలీజైనా ప్రమోషన్లు, విజయోత్సవ సభల పేరుతో వారితో తక్కువ సమయం గడపడటంతో వారు అతనిపై అలకబూనారట. అయితే, భాగ్ మిల్కా భాగ్ సినిమాలలో తండ్రిని, తండ్రి నటనను చూసి పరమానంద భరితులయ్యారట.

  • Loading...

More Telugu News