: మోడీని కలిసిన ఆర్ కృష్ణయ్య
నవభారత యువభేరీ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రచార సారధి నరేంద్ర మోడీని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కలిశారు. పార్క్ హయత్ హోటల్ లో అతనిని కలిసిన కృష్ణయ్య చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరినట్టు తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని కృష్ణయ్య అన్నారు.