: అమీర్ పేటలో సందడి చేసిన అల్లు అర్జున్


ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అమీర్ పేటలో సందడి చేశాడు. అమీర్ పేటలో లాట్ మొబైల్ షోరూం ప్రారంభించాడు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అతనితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. లాట్ మొబైల్స్ కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మరో 15 షోరూములు ఏర్పాటు చేయనున్నామని, వాటితో కలిపి మొత్తం 50 షోరూంలు నగరంలో ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సీమాంధ్ర అల్లర్ల నేపథ్యంలో చిరుపై సమాధానాలు చెప్పాల్సి వస్తుందేమోనని మీడియాకు దొరక్కుండా అల్లు అర్జున్ వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News