: ముగిసిన రెండో రోజు ఆట, భారత్ 182/3
చెన్నయ్ టెస్టులో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అర్థ సెంచరీ సాధించిన సచిన్ (71 నాటౌట్) సెంచరీపై కన్నేశాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు తీసిన ఆసీస్ ఆ తర్వాత అదే ఊపు కొనసాగించలేకపోయింది. కంగారూల జోరుకు అడ్డుకట్ట వేసిన సచిన్.. పుజారా (44), కోహ్లీలతో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కోహ్లీ (50 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీతో మెరవడంతో భారత్ భారీ స్కోరుకు పునాది వేసుకుంది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 380 పరుగులకు ఆలౌటైంది.