: శ్రీవారి దర్శనానికి కాలినడకే శరణ్యం


తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే కాలినడకే భక్తులకు శరణ్యమయ్యేలా ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఈ అర్థరాత్రి నుంచి తిరుమలకు బస్సులు నిలిపివేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాలతో టీటీడీ జేఈవో శ్రీనివాసరావు చర్చలు జరుపుతున్నారు. అయితే జేఈవో కోరికపై ఆలోచిస్తామని సాయంత్రానికల్లా తమ నిర్ణయం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు తెలిపాయి. కాగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని అందువల్ల సమ్మె నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News