: చెన్నై విమానాశ్రయంలో ప్రమాదం
చెన్నై విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. డొమెస్టిక్ టర్మినల్ లో మరోసారి ఫాల్స్ సీలింగ్ పానెల్స్ విరిగిపడ్డాయి. గత మే నెలలో కూడా ఒకసారి 20 ఫాల్స్ సీలింగ్ ప్యానెల్స్ విరిగిపడ్డాయి. అయితే అప్పుడు బలమైన గాలుల వల్ల సీలింగ్ ప్యానెల్స్ విరిగిపడ్డాయన్ని, ఈసారి ఏసీ మూలంగా తడిసి, నానిపోయి కూలి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం అర్థరాత్రి సమయంలో జరగడంతో ఎవరికీ హాని జరగలేదు. ఆ సమయంలో విమానాలేవీ లేకపోవడంతో విమానాశ్రయంలో ప్రయాణీకులు లేరని పోలీసులు తెలిపారు. అందువల్లే పెను ప్రమాదం తప్పిందని అన్నారు.