: కూతుర్ని అనుభవిస్తున్న మృగాడి అరెస్ట్
తండ్రే కూతురిపై కన్ను వేస్తే... ఇక ఆడపడుచుల మానానికి రక్షణ ఎవరు? కూతుర్లపై తండ్రుల అత్యాచారాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతుండడం ఆందోళనకరమైన అంశం. తాజాగా ఢిల్లీలో నాలుగేళ్లుగా కూతురిపై అత్యాచారం చేస్తున్న రామ్ అవతార్ అనే ట్యాక్సీ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నగర శివారులోని కరావల్ నగర్లో రామ్ అవతార్ తన భార్య ఇద్దరు కూతుర్లతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం పెద్ద కూతురిపై అత్యాచారం చేయబోగా ఆమె తప్పించుకుని తల్లికి విషయం చెప్పింది. దాంతో ఆమె ఇద్దరు కూతుర్లను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అదే సమయంలో 16 ఏళ్ల చిన్న కూతురు తనపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తూ ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తున్నాడని వెల్లడించింది. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపగా అత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసి నిందితుడు రామ్ అవతార్ ను అరెస్ట్ చేశారు.