: వైఎస్సార్ సీపీకి ఇంద్రకరణ్ రెడ్డి ఝలక్
వైఎస్సార్ సీపీకి మరో నేత ఝలకిచ్చారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత ఇంద్రకరణ్ రెడ్డి మధ్యాహ్నం 12.30 గంటలకు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు నిర్మల్ లో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతూ వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుంటున్నందు వల్ల తానీ నిర్ణయానికి వచ్చినట్టు ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.