: జమ్మూలో జైట్లీ అరెస్టు
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీని జమ్మూ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత ఘర్షణలు చెలరేగిన నేపధ్యంలో ఆయన కిష్త్వార్ జిల్లాలో పర్యటించేందుకు జమ్మూ చేరుకున్నారు. కాగా కిష్త్వార్ జిల్లాలో ఉద్రిక్తతలు పెరిగి కర్ఫ్యూ మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన నేపధ్యంలో జైట్లీ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఘర్షణల ప్రాంతంలో ఆయన పర్యటిస్తే అవి మరింత పెరిగే అవకాశముండడంతో జైట్లీని తిప్పి పంపే అవకాశముంది.