: అక్బరుద్దీన్... మార్చి1న కోర్టు ముందు హజరవ్వు: బెంగళూరు కోర్టు
హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మళ్లీ.. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ వివాదంపై బెంగళూరు కోర్టులో కూడా కేసు నమోదయింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా న్యాయస్థానం ముందు హజరుకాలేనని కోరుతూ అక్బరుద్దీన్ బెంగళూరు కోర్టుకు అభ్యర్థన పంపారు.
దీనిపై స్పందించిన చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజశేఖర్ ఆయనను మార్చి 1వ తేదీన కోర్టు ముందు హజరుకావాలని ఆదేశించారు. ప్రస్తుతం బెయిల్ దొరకడంతో ఆదిలాబాద్ జైలు నుంచి బయటకు వచ్చిన అక్డరుద్దీన్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.