: ఈ ఐఫోన్ పరికరం జేబులో ఉంటే గుండెకు శ్రీరామరక్ష
గుండె స్పందనల్లో తేడాలను గుర్తించి గుండెపోటు రాకముందే దాన్ని హెచ్చరికల ద్వారా తెలియజేసే ఒక ఐఫోన్ పరికరాన్నిఆస్ట్రేలియా శాస్త్రవేత్త, అమెరికా కార్డియాలజిస్ట్ తయారు చేశారు. దీని పేరు అలీవ్ కార్ హార్ట్ మానిటర్. అట్రియల్ ఫిబ్రిలేషన్ (హార్ట్ రేటులో హెచ్చు తగ్గులు) అనే సమస్యను ఇది గుర్తిస్తుందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. దీనిని ఐఫోన్ ద్వారా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఈ పరికరాన్ని సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రీడ్ మాన్ అతని సహాయకులు కలిసి 65 ఏళ్లు అంతకంటే పెద్ద వయసు వారిపై ఈ పరికరం పనితీరును ప్రయోగించి చూడగా, మంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రతి మూడు గుండెపోటు కేసులలో ఒకటి అట్రియల్ ఫిబ్రిలేషన్ ద్వారా వచ్చేదేనని ఫ్రీడ్ మాన్ చెప్పారు.