: నగరానికి చేరుకున్న మోడీ


నవభారత యువభేరి సభలో పాల్గొనేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు దత్తాత్రేయ, లక్ష్మణ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోడీ బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ కు వెళ్లారు. అక్కడే మధ్యాహ్నం వరకూ పలువురు ప్రముఖులతో సమావేశమై సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు వెళతారు.

  • Loading...

More Telugu News