: సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిని మృతి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాత్రి మోహినీ మిశ్రా అనే విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మరణించింది. యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు విడిచింది. ఇద్దరు యువకులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చందానగర్ పోలీసులు ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనను బట్టి చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎలాంటి పనులకు పాల్పడుతున్నారోననే సందేహాలు తలెత్తుతున్నాయి.