: పడవ పందాలు ప్రారంభించిన చిరంజీవి
ఓ వైపు సీమాంధ్రలో ఉద్యమజ్వాలలు మిన్నంటుతున్నా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మాత్రం తన బాధ్యతలకు కట్టుబడి పనిచేస్తున్నారు. తాజాగా, ఆయన కేరళలో పడవ పందాలను ప్రారంభించారు. అలప్పుజలో ఈ రోజు ఉదయం 61వ నెహ్రూ పడవ పందాల టోర్నీని లాంఛనంగా ఆరంభించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిరంజీవి రాజీనామా చేయాలని సీమాంధ్రలో డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేయకపోతే, మెగా ఫ్యామిలీ సినిమాలను అడ్డుకుంటామని ఉద్యమకారులు హెచ్చరించారు. దీంతో, పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా విడుదల తేదీ అనిశ్చితిలో పడింది. ఈ సినిమా వాస్తవానికి ఈనెల 9న విడుదల కావాల్సి ఉంది.