: తెలుగుజాతి కోసం చంద్రబాబు బస్సు యాత్ర


ఇటీవలే పాదయాత్ర చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ రాబట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ పర్యాయం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకంటూ బస్సు యాత్ర చేపట్టాలని బాబు నిర్ణయించుకున్నారు. ఈ తాజా యాత్రకు 'తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ యాత్ర' అని నామకరణం చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఇబ్బందులు తప్పవని, ఢిల్లీ పెత్తనంతో తెలుగుజాతి అస్తవ్యస్తంగా తయారైందన్న కోణంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ యాత్రను సాగించనున్నారు. కాగా, ఈ యాత్రకు ముందే బాబు.. ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలుస్తారని, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వారికి వివరిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News