: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆవిర్భావం


సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు జేఏసీని ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఏర్పడ్డ ఈ జేఏసీ 12న విజయవాడలో ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇన్నాళ్లూ రెచ్చగొట్టినా ఇన్ని రోజులు సంయమనం పాటించామని, ఇక నుంచి తమకు జరుగుతున్న అన్యాయాల్ని అడ్డుకుంటామని తెలిపారు. తప్పని సరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాము ఉద్యోగం చేయలేమని, హైదరాబాద్ లో నివసిస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల భద్రత కోసం త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News