: జగన్, విజయమ్మలపై మండిపడ్డ హరీశ్


టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై మండిపడ్డారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, పదవులకు రాజీనామా చేయడం ద్వారా వారిద్దరూ సమైక్యవాదులే అని స్పష్టమయిందని ఆయన అన్నారు. తద్వారా వారు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించనట్టయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై సీమాంధ్ర నేతలు విషం కక్కుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పీఠమెక్కిన సీఎం కిరణ్ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపారని హరీశ్ రావు విమర్శించారు. ఇక, వీరందరిదీ ఒకెత్తయితే ఉండవల్లిది మరో ఎత్తంటూ.. ఆయన కేసీఆర్ ను బూచిగా చూపి పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News