: కలసి ఉంటే కలదు సుఖం: శైలజానాథ్


కలసి ఉంటే కలదు సుఖమని, రాజకీయ కారణాలు చూపి విభజించడం సరికాదని మంత్రి శైలజానాథ్ హితవు పలికారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ చిత్ర పటంలో తెలుగువారికి ప్రధాన పాత్ర ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతమని తెలిపిన ఆయన, ఆంగ్లేయుల సిద్ధాంతం విభజించు- పాలించు అని స్పష్టం చేశారు. మేధావుల పోరాట ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, దాన్ని ముక్కలు చేస్తే అభివృద్ధి శూన్యమని గుర్తించాలని సూచించారు.

  • Loading...

More Telugu News